అమితాబ్ బచ్చన్‌కు భారతరత్న ఇవ్వాలి..
ప్రముఖ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు భారత రత్న అవార్డు ఇవ్వాలని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అమితాబ్ బచ్చన్ దంపతులతో పాటు షారుఖ్ ఖాన్, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అమితాబ్ ఒక లెజెండ్ అని, ఇండియాకే ఒక ఐకాన్ అని ఆమె కొనియాడారు. భారత సినీ పరిశ్రమకు ఆయన ఎంతో చేశారన్నారు. భారత రత్నకు అమితాబ్ అన్ని విధాలా అర్హుడని చెప్పారు.

