వచ్చే ఎన్నికల్లో 26 జిల్లాల్లో వైసీపీకి 26 సీట్లే..
నెల్లూరు : వచ్చే ఎన్నికల్లో 26 జిల్లాల్లో వైసీపీకి 26 సీట్లు వస్తాయని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఐఏఎస్‌లు కార్యాలయానికి రావడం లేదన్నారు. ఎస్ఆర్ శంకరన్ వంటి ఐఏఎస్ అధికారులు కనిపించడం లేదని చింతా మోహన్ అన్నారు. ఏపీలో విద్యుత్తు మీటర్ల కొనుగోళ్లలో రూ.1000కోట్ల స్కాం జరిగిందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. అందులో ప్రభుత్వ పెద్దలు, మంత్రి, ఐఏఎస్ అధికారులకి వాటాలున్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యుత్ మీటర్ల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం ఎందుకు అత్యుత్సాహాం చూపుతోందని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. రూ.6 వేల విలువ చేసే మోటర్ కొటేషన్‌ను రూ.30వేలకి పెంచారని చింతా మోహన్ విమర్శించారు.

