Home Page SliderInternationalSports

బాబర్‌ కంటే కోహ్లీనే ఎక్కువగా ప్రేమిస్తాం

ముల్తాన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్‌ 26 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే.. ఈ మ్యాచ్‌లో కొందరు పాక్‌ ఫ్యాన్స్‌ ప్రదర్శించిన ఫ్లకార్డులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వారు పాక్‌ ఆటగాళ్లకు కాకుండా టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి మద్దతు తెలపడం విశేషం. తమ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ కంటే కోహ్లీనే ఎక్కువగా ప్రేమిస్తున్నామని చెప్పడం ఆశ్చర్యకరమైన విషయం. వారు పద్రర్శించిన ఫ్టకార్డులో ఇలా చెప్పుకొచ్చారు. “హాయ్‌… కింగ్‌ కోహ్లీ.. పాక్‌ వచ్చి ఆసియా కప్‌ ఆడు, మా కింగ్‌ బాబర్‌ కంటే మేం మిమ్మల్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాం” అంటూ మ్యాచ్‌ మధ్యలో ఫ్యాన్స్‌ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.