ప్రగతి భవన్కు చేరుకున్న కవిత, కేసీఆర్తో చర్చలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీబీఐ నోటీసులు అందుకున్న కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత… ప్రగతి భవన్ వచ్చారు. మొత్తం వ్యవహారంపై న్యాయనిపుణులతో ఇప్పటికే చర్చించిన కవిత… సమాచారాన్ని కేసీఆర్కు వివరించేందుకు వచ్చినట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ వ్యవహారం, సీబీఐ నోటీసుల నేపథ్యంలో ఏం చేయాలి? ఎలా అడుగులు వేయాలన్నదానిపై కవిత, కేసీఆర్ సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. కవితకు సీబీఐ నోటీసుల నేపథ్యంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ఇవాళ కవిత నివాసం చేరుకున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణంపై విచారణకు సీబీఐ ఎదుట హాజరుకావాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. 160 Crpc కింద శుక్రవారం నోటీసులు పంపించింది. కేసుకు సంబంధించిన అనేక విషయాల్లో కవితకు ప్రమేయం ఉన్నందున, సాక్షిగా పిలుస్తున్నట్టు దర్యాప్తు సంస్థ పేర్కొంది. నోటీసులో, సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ షాహి, ఢిల్లీ, GNCT, డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మరియు 14 మందిపై MHA డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాయ్ నుండి వచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయబడింది. 2021-22 సంవత్సరానికి ఢిల్లీకి చెందిన జిఎన్సిటి ఎక్సైజ్ పాలసీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఇతరులు కేసు దర్యాప్తు సందర్భంగా కవితకు సంబంధమున్నట్టుగా కొన్ని అంశాలు బయటపడ్డాయంది. అందువల్ల దర్యాప్తు దృష్ట్యా ఆ వాస్తవాలపై ఆమె పరిశీలన అవసరమని సీబీఐ నోటీసులో పేర్కొంది.

