NationalNews

ఛత్తీస్‌ సీఎం డిప్యూటీ సెక్రటరీ అరెస్ట్‌

ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో ఈడీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. తాజాగా ఆ రాష్ట్ర సీఎం భూపేశ్‌ బఘేల్‌ డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియాను ఈడీ అరెస్ట్‌ చేసింది. రాష్ట్రంలో జరిగిన బొగ్గు లెవీ స్కాం మనీలాండరింగ్‌ కేసులో ఆమెను అరెస్ట్‌ చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో శక్తిమంతమైన బ్యూరోక్రాట్‌గా పేరున్న చౌరాసియాను ఈడీ అధికారులు ప్రశ్నించిన అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ చేసిన అనంతరం సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది భద్రతతో ఈడీ అధికారులు ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.