NationalNews

తగ్గనున్న వంట గ్యాస్‌ ధర..?

కొంతకాలంగా పెరుగుతూ వస్తున్న వంట గ్యాస్‌ ధర త్వరలో తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎన్‌జీ, ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గుముఖం పట్టడం కూడా ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి. గ్యాస్‌ ధరలను నియంత్రించేందుకు సెప్టెంబరులో ఏర్పాటు చేసిన కమిటీ ఈ మేరకు ఒక ప్రణాళికను రూపొందిస్తోంది. ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు కిరీట్‌ ఎస్‌.పరేఖ్‌ నేతృత్వంలోని కమిటీ గ్యాస్‌ ధరలను తగ్గించాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే సామాన్య ప్రజలకు భారీ ఊరట కలగనుంది. గత నెలలో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గిన విషయం తెలిసిందే.