ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులకు ఎదురు దెబ్బ
మొయినాబాద్ ఫాంహౌస్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేశారన్న కేసులో తెలంగాణ హైకోర్టు ట్విస్ట్ ఇచ్చింది. నిందితుల విచారణపై గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. ఈ కేసును మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేయొచ్చని.. నిందితులను విచారించొచ్చని స్పష్టం చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పిటిషన్‌ను పెండింగ్‌లో పెట్టింది. దర్యాప్తును ఎక్కువ రోజులు నిలిపివేయడం మంచిది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశముంది.