నేను గెలుస్తానన్న నమ్మకం ఉంది
ఈ ఎన్నికల్లో చివరి వరకూ హోరాహోరీ పోరు తప్పకపోవచ్చని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రౌండ్ రౌండ్‌కు ఫలితాలు ఉత్కంఠతను రేపిస్తున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందన్నారు. చౌటుప్పల్‌లో తమకు అనుకున్న మెజారిటీ రాలేదన్నారు.

