సగరులు సగర్వంగా బ్రతకాలి
హైదరాబాద్‌లో సగర సంఘం భవన నిర్మాణానికి పూర్తి మద్దతు అందిస్తామని, ఆ స్థలం మీకే దక్కెంతవరకు అండగా ఉంటామని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సంస్థాన్ నారాయణపురంలో సగర సంఘం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సగరులు సగర్వంగా బ్రతకాలన్నారు. భారత దేశ చరిత్రలో కేంద్ర మంత్రివర్గంలో ఇంత పెద్ద ఎత్తున బీసీలకు మంత్రులను చేయడం ఇదే తొలిసారి. దళితుడు రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిగా చేశారు. ఇప్పుడు ఒక గిరిజన ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేసింది బీజేపీ అని అన్నారు. తెలంగాణ వస్తే నిధులు, నీళ్లు , నియామకాలు వస్తాయి అనుకున్నాము… కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలలో ఏ మార్పు రాలేదని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి పదవులు వచ్చాయి, వేలకోట్ల రూపాయలు సంపాదించుకున్నారని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
