NationalNews

రిషి సునక్‌కి, ప్రధాని మోదీ ఫోన్

రిషి సునక్‌కి మొదటి కాల్‌లో, ప్రధాని మోదీ భారతదేశం-యుకె వాణిజ్య ఒప్పందాన్ని చర్చించారు. ఇండియా, యూకే మధ్య స్వేచ్ఛా-వాణిజ్య ఒప్పందాన్ని త్వరలో ముగించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తేల్చిచెప్పారు. బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునక్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మాట్లాడారు. రిషి సునక్‌తో మాట్లాడటం ఆనందంగా ఉందన్న మోదీ… UK ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలిపారు. రెండు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, మీతో కలిసి పని చేస్తామని రిషికి మోదీ వివరించారు. FTA ప్రాముఖ్యతను ఉభయులం అంగీకరించామన్న మోదీ.. ఇందుకు సంబంధించి ట్వీట్ చేశారు.

ప్రధానమంత్రికి ధన్యవాదాలు చెప్పారు రిషి సునక్. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో మీతో మాట్లాడటం ఆనందాన్నిచ్చిందన్నారు రిషి. ఇంగ్లాండ్, ఇండియా చాలా అంశాల్లో ఒకే అభిప్రాయంతో ఉన్నాయన్నారు. రాబోయే నెలలు & సంవత్సరాల్లో ఉభయ దేశాల భద్రత, రక్షణ, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాల్సి ఉందన్నారు. రెండు గొప్ప ప్రజాస్వామ్యాలు ఏదైనా సాధించగలవని రుజువు చేస్తాయన్నారు.