ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా సిబ్బంది మందు పార్టీ…
హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మహిళా సిబ్బంది మందు పార్టీ చర్చనీయాంశంగా మారింది. స్టాఫ్ రూంలో బీర్లు తాగుతూ మహిళా సిబ్బంది హల్‌చల్ చేశారు. రోగులను గాలికి వదిలేసి బీరు తాగుతూ ఎంజాయ్ చేశారు. మందు పార్టీలో ఆరోగ్యశ్రీ ఉద్యోగి, ఒక స్టాఫ్ నర్స్, మరొక జీఎన్‌ఎం ఉన్నారు. ఓ మహిళ పుట్టిన రోజు వేడుకల పేరిట బీరు తాగుతూ పార్టీ చేసుకున్నారు. అయితే… సిబ్బంది వెకిలి చేష్టలపై పేషేంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం ఆస్పత్రి ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో.. వారు మహిళా సిబ్బందిని పిలిపించి, మందలించి వదిలేశారని సమాచారం. ఆసుపత్రిని బార్‌గా మార్చిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.