International

నెదర్లాండ్‌పై టీమిండియా విజయం

టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా నెదర్లాండ్‌పై టీం ఇండియా 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 179 పరుగులు చేసింది.  నెదర్లాండ్‌ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. నెదర్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌లో టిమ్‌ ప్రింగ్లీ (20), మ్యాక్‌ దోవ్డ్‌ (16), బాస్‌ డీ లీడీ (16), కోలిన్‌ అక్కర్‌మాన్‌ (17) పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, అక్షర పటేల్‌, రవీచంద్రన్‌ అశ్విన్‌, అర్షదీప్‌ సింగ్‌ తలో రెండు వికెట్లు తీయగా మహ్మద్‌ షమీ ఒక వికెట్‌ పడగొట్టారు.  భారత్‌ బ్యాటింగ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (53), విరాట్‌ కోహ్లీ (62), సూర్యకుమార్‌ యాదవ్‌ (51) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.