ప్రపంచం వ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సప్ సేవలు
సమాచారానికి కొత్త నిర్వచనం చెప్పిన వాట్సప్ మూగబోయింది. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతం నుంచి మేసేజ్‌లు వెళ్లకపోవడంతో కస్టమర్లు ఆగమాగమవుతున్నారు. ఎక్కువ మంది మేసేజ్‌లు పోవడం లేదని చెబుతుంటే మరికొందరు సర్వర్ డిస్కనెక్షన్ అవుతందంటూ లబోదిబోమంటున్నారు. కొంతమందికి యాప్ క్రాష్ అయ్యిందని కూడా చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. టెక్నికల్ సమస్య తలెత్తడంతో మెసేజ్‌లను పంపడం, రిసీవ్ చేసుకోవడం ఆగిపోయింది. వాట్సాప్ మెసేజ్ డెలివరీ అయినట్టు టిక్ మార్క్ కూడా కనిపించడం లేదు. ఇది వాట్సప్ చరిత్రలో అతిపెద్ద అంతరాయంగా భావిస్తున్నారు. ప్రముఖ ఆన్లైన్ టూల్ డౌన్ డిటెక్టర్ మధ్యాహ్నం 12.07 గంటల నుంచి సమస్యలు వస్తున్నాయంటూ ఆందోళనలు మొదలయ్యాయి. భారతదేశంలోని వినియోగదారుల ఆధారంగా WhatsApp అతిపెద్ద మార్కెట్ అయిన భారతదేశంలో మధ్యాహ్నం 1 గంట తర్వాత ఇలాంటి రాకపోకలు లేవన్న అభిప్రాయం స్పష్టమైంది. 69 శాతం సందేశాలు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఇటలీ, టర్కీకి చెందిన సోషల్ మీడియా వినియోగదారులు కూడా సందేశాలు పంపలేకపోతున్నారని పోస్ట్ చేశారు. UK అంతటా ఉన్న వినియోగదారులకు సందేశ సేవ నిలిపివేశారని BBC నివేదించింది.
వాట్సప్‌ను పునరుద్దరించడానికి కృషి చేస్తున్నట్లు మెటా తెలిపింది. ప్రస్తుతం కొంతమందికి సందేశాలు పంపడంలో సమస్య ఉందని సమాచారం అందిందన్న సంస్థ… వీలైనంత త్వరగా అందరికీ WhatsAppని పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని పేర్కొంది. ట్విట్టర్ మరియు ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో #WhatsAppDown అనే హ్యాష్‌ట్యాగ్‌తో మెమె ఫెస్ట్ ప్రారంభమైంది. చాలా మంది వినియోగదారులు తమ ఇంటర్నెట్ సేవ సమస్యగా భావించినట్లు చెప్పారు. కానీ అది వాట్సప్ లో ప్రాబ్లమ్ అని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నట్టు సందేశాలను పోస్ట్ చేస్తున్నారు. మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా మధ్యాహ్నం తర్వాత పని చేయడం లేదు.

