NationalNews

బ్రిటన్‌లో దివాలీ.. యూకే ప్రధానిగా భారతీయుడు రిషి సునక్

బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ ఆ దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధాని రేసులో ఉన్న ప్రత్యర్థి పెన్నీ మోర్డాంట్ ఈరోజు 100 మంది ఎంపీల మద్దతును పొందడంలో విఫలమైతే… ఆ దేశ తదుపరి ప్రధానమంత్రి రిషి అవుతారు. సునక్‌కు ఇప్పటికే 142 మంది పార్లమెంటు సభ్యుల మద్దతు ఉంది. పెన్నీ మోర్డాంట్‌కు కేవలం 29 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. జూలైలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన బోరిస్ జాన్సన్, నామినేషన్ దాఖలు చేయడానికి గడువుకు కొన్ని గంటల ముందు రేసు నుండి వైదొలిగారు. బ్రిటన్ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు 100 మంది ఎంపీల మద్దతును పొందడంలో మోర్డాంట్ విఫలమైతే, రిషి ప్రధాన మంత్రి అయినట్టే… ఇంటే ఇవాళ సాయంత్రం 6 గంటల లోపు మొత్తం వ్యవహారంపై క్లారిటీ రానుంది. బ్రిటన్ నిబంధనల ప్రకారం, గరిష్టంగా ముగ్గురు టోరీ ఎంపీలు ప్రధాని పదవికి పోటీ చేయగలుగుతారు. ఐతే సదరు అభ్యర్థి ప్రధాని రేసులో నిలవాలంటే పార్టీలో 100 మంది ఎంపీల మద్దతు పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్టీలో మొత్తం 357 మంది ఎంపీలు ఉన్నారు. కొత్త ప్రధానిని ఈ శుక్రవారం నాటికి ఎన్నుకుంటారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం, పార్టీని ఏకం చేయడం…. దేశానికి దిశానిర్దేశం చేయడమే లక్ష్యమని చెబుతూ రిషి సునక్ తన అధికారిక అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రిగా జాన్సన్ పతనంలో సునక్ కీలక పాత్ర పోషించారన్న విమర్శ ఉంది. ఐతే మొత్తం వ్యవహారాల నడుము జాన్సన్, సునక్ గత రాత్రి ఒక ఒప్పందంపై ఊహాగాన కుదుర్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.