విశాఖలో పాన్ ఇండియా డ్రగ్స్ డీలింగ్స్
విశాఖలో డ్రగ్స్ డీలింగ్స్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా వీరు పాన్ ఇండియా లెవల్లో డ్రగ్స్ డీలింగ్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో కీలక నిందితుడుగా ఉన్న అలెక్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో విశాఖలో డ్రగ్స్ సరఫరా జోరుగా జరుగుతుందని ఓ వార్త బయటకు వచ్చింది. దీంతో విశాఖ పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అనుకున్నదే తడువుగా పోలీసులు డ్రగ్స్‌కు సంబంధించి విచారణ ప్రారంభించారు. దీనిలో భాగంగా డ్రగ్స్ పెడ్లర్స్‌ను విచారించగా.. డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. ఈ డ్రగ్స్ విచారణలో తీగ లాగితే..డొంక కదిలినట్లు తెలుస్తోంది. అయితే ఈ ముఠా ఆన్లైన్ పేమెంట్ల ద్వారా డ్రగ్స్ ముఠా లావాదేవీలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీ ప్యాక్ ఇన్‌స్టా అకౌంట్ ద్వారా వారు ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.

