రేపు మనీశ్ సిసోడియా అరెస్ట్-ఆప్
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ రేపు అరెస్టు చేస్తోందని ఆప్ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీశ్ సిసోడియాను రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాల్సిందిగా సీబీఐ సమన్లు జారీ చేసింది. రేపు మనీశ్ సిసోడియాను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారంటూ ఆరోపించారు ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇది జరుగుతోందంటోంది ఆప్. ఆప్ అంటే బీజేపీ భయపడుతోందని ఆయన విమర్శించారు. గతంలో సీబీఐ విచారణ సందర్భంగా తన నివాసంలో ఏమీ లభించలేదని… పూర్తి స్థాయిలో తాను సహకరించానన్నారు మనీశ్. 14 గంటల పాటు విచారించినా ఏం లభించలేదన్నారు. బ్యాంక్ లాకర్ కూడా శోధించారన్నారు. రేపు సీబీఐ కార్యాలయానికి రావాల్సిందిగా కోరారని.. అధికారులకు పూర్తిగా సహకరిస్తానన్నారు. జైలు గోడలు, ఉరితాళ్లు, భగత్ సింగ్ ను భయపెట్టలేదని… ఇదో రెండో స్వాతంత్ర్య పోరాటమని.. మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ నేటి భగత్ సింగ్ రూపాలని చెప్పుకొచ్చారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.

