మోస్ట్ పాపులర్ హీరో ప్రభాస్, హీరోయిన్ సమంత
తెలుగు సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచాడు. ప్రముఖ మీడియా సంస్థ ORMAX INDIA ప్రతినెల దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే నిర్వహించి.. టాప్ పొజిషన్‌లో ఉన్న సెలబ్రెటీల జాబితాలను విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ తెలుగు ఫిలిం స్టార్స్ సర్వే జాబితాను ఆర్మాక్స్ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో ప్రభాస్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ప్రభాస్ తాజాగా మూడోసారి ORMAX లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచాడు.. ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్, అల్లుఅర్జున్, రామ్‌చరణ్, మహేష్ బాబు తరువాతి స్థానాల్లో ఉన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో కూడా ప్రభాస్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక హీరోయిన్‌లలో సమంత మొదటి స్థానంలో ఉండగా కాజల్ రెండవ స్థానంలో ఉంది. అనుష్క, సాయి పల్లవి తరువాతి స్థానల్లో ఉన్నారు.

