జాన్వికపూర్ ‘మిలి’ మూవీ టీజర్ అదరహో
అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ముఖ్యపాత్రలో విడుదల అవబోతున్న చిత్రం మిలి. ఈ చిత్రానికి ఆమె తండ్రి బోనీకపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించారు. ఈ రోజు ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. జాన్వి ఈసినిమాలో నర్సు పాత్రలో కనిపిస్తోంది. ఈ పోస్టర్లు అభిమానులకు చాలా నచ్చాయి. వీటిని జాన్వి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
జాన్వి ఈ టీజర్‌లో మైనస్ 16 డిగ్రీల చలిలో ఫ్రీజ్ అయిపోయినట్లు కనిపిస్తుంది. తన నోటిని ఉపయోగించి టేపులను చింపివేస్తున్నట్లు టీజర్ మొదలవుతుంది. దీనిలో డైలాగులు లేకపోయినా ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది జాన్వి. ఈ స్టిల్‌లో ఆమెను టేపుతో కట్టివేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ టీజర్‌ను మనమూ చూసేద్దామా..

