కేసీఆర్ ట్రిపుల్ఆర్‌కు భయపడుతున్నారు
ఈ రోజు కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయాలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ మేరకు ప్రతిపక్షాలు ఆయనపై విరుచుకు పడుతున్నాయి. తాజాగా కేసీఆర్ కేంద్రంపై చేసిన ఆరోపణలకు తెలంగాణా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కాస్త ఘాటుగానే స్పందించారు. కేంద్రం మోటర్లకు మీటర్లు పెట్టిందనే కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ వ్యాఖ్యలు నిజమైతే తాను తక్షణమే రాజీనామా చేస్తానని బండి సంజయ్ కేసీఆర్‌కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో కేంద్రం మోటర్లకు మీటర్లు పెట్టిన మాట వాస్తవం కాకపోతే కేసీఆర్ రాజీనామా చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్రం పెట్టిన బిల్లును కేసీఆర్‌కు పంపిస్తానన్నారు. ప్రస్తుతం కేసీఆర్ ట్రిపుల్‌ఆర్‌కు భయపడుతున్నారన్నారు. అయితే త్వరలో నాలుగో ఆర్ కూడా రానుందని బండి సంజయ్ తెలిపారు.

