News AlertTelangana

గాంధీ పుట్టిన దేశమా ఇది… ! కేంద్రంపై కేసీఆర్ ఫైర్

కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్… జాతీయ జెండానే మార్చేస్తామంటున్నారని దుయ్యబట్టారు. ఇది మహాత్మాగాంధీ పుట్టిన నేలేనా అని ప్రశ్నించారు. కొందరు మరుగుజ్జుమాటలు మాట్లాడుతున్నారన్నారు. వేరే పార్టీలను ఉండబోమని కేంద్ర హోం మంత్రి మాట్లాడుతన్నారని… కేంద్ర హోం మంత్రి ఇంత అప్రజాస్వామికంగా మాట్లాడొచ్చా అని ఆక్షేపించారు. బీజేపీ నేతల మాటలతో భరతమాత గుండెకు గాయమవుతుందన్నారు. గాంధీ, బుద్ధుడు పుట్టిన దేశంలో ఏం జరుగుతుందో ఆలోచించాలన్నారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్నారన్నారు. దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేశారన్నారు కేసీఆర్. తెలంగాణలో బీజేపీకి ఉంది ముగ్గురు ఎమ్మెల్యేలు. మమ్మల్ని కూడా తీసేస్తా్మంటూ మాట్లాడారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోయేకాలం వచ్చింది కాబట్టే అలా మాట్లాడుతున్నారన్నారు. హిట్లర్, నెపోలియన్, ముస్సోలిని లాంటివారే చరిత్రలో కలిసిపోయారన్నారు కేసీఆర్.

బీజేపీకి ఎప్పుడూ కూడా 50 శాతం ఓట్లు రాలేదన్నారు కేసీఆర్. మేకిన్ ఇండియా పూర్తిగా అబద్ధమన్నారు. టపాసులు, మాంజా, జెండాలు అన్నీ చైనా నుంచే వస్తున్నాయన్నారు. ఎక్‌నాథ్ షిండేలతో భయపెట్టాలని కేంద్రం చూస్తోందని దుయ్యబట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్రం చేస్తున్న అన్యాయలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానంటూ కుండబద్ధలు కొట్టారు. NPAల వెనుక లక్షల కోట్ల కుంభకోణం ఉందన్నారు.