మునుగోడులో గెలిచేది మనమే-సునీల్ బన్సల్
మునుగోడులో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి… బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉపఎన్నికలో గెలిచేలా పార్టీ కసరత్తు చేస్తోంది. తెలంగాణ బీజేపీ ఇన్ చార్జి సునీల్ బన్సల్ ఇవాళ మునుగోడులో జరిగిన బీజేపీ బూత్ కమిటీ, ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఉత్తేజపరిచేలా కార్యక్రమాలు రూపొందించాలని నేతలను ఆదేశించారు సునీల్ బన్సల్. పార్టీ నేతలకు, కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణ వివరించారు. వచ్చే రోజుల్లో మునుగోడు కేంద్రంగా బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాలను వెల్లడించారు. మునుగోడు ఎన్నికలో బీజేపీ గెలిచితీరుతుందన్నారు బన్సల్. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, తదితరలు పాల్గొన్నారు.


