NationalNews Alert

విగ్రహాన్ని తాకాడని.. బాలుడిపై దాడి

కన్నౌజ్ జిల్లా సదర్ కొత్వాలి గ్రామానికి చెందిన దళిత బాలుడిపై దాడి జరిగింది. గణేష్ చతుర్థి సందర్భంగా  సన్నీ గౌతమ్ అనే బాలుడు వినాయక విగ్రహాన్ని తాకేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన మండప నిర్వాహకుడు బబ్బన్ గుప్తా తన ఇద్దరు కుమారులతో కలిసి అతనిపై దాడికి దిగారు. దీంతో సన్నీ గౌతమ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు అగ్రహం వ్యక్తం చేశారు. కానీ బబ్బర్ మాత్రం ఆ బాలుడు మద్యం తాగినందువల్లే మండపంలోనికి వెళ్లనివ్వలేదని చెబుతున్నాడు. అయినా కూడా బాలుడిపై దాడి చేయడం నేరం అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.