NationalNews

ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి

కోవిడ్-19కి అదుపు చేసేందుకు భారత్ బయోటెక్ రూపొందించిన ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ వినియోగానికి కేంద్రం లైన్ క్లియర్ చేసింది. కోవిడ్ పోరాటానికి ఇది పెద్ద ఉపశమన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా. అత్యవసర పరిస్థితుల్లో పెద్దవారిలో అవసరం మేరకు వినియోగించేందుకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసిక్ వ్యాక్సిన్‌‌కు డ్రగ్ కంట్రోలర్ ఆమోదించిందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇండియా సైన్స్, రీసెర్చ్ రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధిస్తోందని ఆయన తెలిపారు.

ఫిబ్రవరిలో, దేశంలోని మొట్టమొదటి యాంటీ-కోవిడ్ డ్రగ్స్‌కు సంబంధించి ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్… పెద్దలు వినియోగించేందుకు నాసల్ స్ప్రేను… బ్రాండెడ్ ఫ్యాబిస్ప్రేగా… సానోటైజ్ భాగస్వామ్యంతో అందుబాటులోకి తెచ్చింది. తాజాగా భారత్ బయోటెక్… వేగవంతమైన ఆమోద ప్రక్రియలో భాగంగా కంపెనీ నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి తయారీ మరియు మార్కెటింగ్ ఆమోదాన్ని పొందింది. భారతదేశంలో ఫేజ్ 3 ట్రయల్ కీలక దశకు చేరుకొంది. దేశంలోని 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించవచ్చని కేంద్రం పేర్కొంది.

ఇక ఇండియాలో గదడిచిన
24 గంటల్లో 4,417 కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. ఇది మూడు నెలల్లో కనిష్ట స్థాయిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కోవిడ్ కేసులు 52,336కి తగ్గాయి. ఒక్కరోజులో కరోనాతో 23 మంది మృతి చెందారు. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 0.12 శాతం ఉండగా, రికవరీ రేటు 98.69 శాతానికి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అభివృద్ధి కూడా ఊపందుకుంది. ఒమిక్రాన్ మరియు వైరస్ అసలైన జాతులు రెండింటినీ లక్ష్యంగా చేసుకోవడానికి బూస్టర్‌గా ఉపయోగించబడే రెండవ “బైవాలెంట్” వ్యాక్సిన్‌ను UK ఆరోగ్య అధికారులు శనివారం ఆమోదించారు.