NationalNews

విశ్వాస పరీక్షలో నెగ్గిన సోరెన్

జార్ఖండ్‌లో శిబూ సోరెన్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. సోమవారం ప్రత్యేక అసెంబ్లీని నిర్వహించిన ముఖ్యమంత్రి శిబూ సోరెన్‌ విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆయనకు మద్దతుగా 48 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సోరెన్‌కు 42 మంది ఎమ్మెల్యేల మద్దతుంటే సరిపోతుంది. సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు. ఈ సందర్భంగా రెండు రోజుల పాటు రాష్ట్రంలో హైడ్రామా కొనసాగింది. మైనింగ్‌ వ్యవహారంలో సీఎం సోరెన్‌ తీసుకున్న నిర్ణయం కారణంగా ఆయనపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర గవర్నర్‌కు ఎన్నికల సంఘం సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో తాను విశ్వాస పరీక్షను ఎందుర్కొంటానని సోరెన్‌ ప్రకటించారు. తన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర పన్నిన బీజేపీ నేతలు తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తోందని సోరెన్‌ మండిపడ్డారు.