Andhra PradeshNews

జగన్ పై చంద్రబాబు ఫైర్…

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీని అప్పు కోసం తాకట్టు పెట్టినా ప్రశ్నించకూడదంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల విలీనం పేరుతో బాలబాలికలకు విద్యను దూరం చేస్తున్నారన్నారు. విద్యాశాఖలో సంస్కరణల పేరుతో తెచ్చిన సంక్షోభానికి ఇకనైన రాష్ర్ట ప్రభుత్వం తెరదించాలన్నారు. గురువును దైవంగా భావించే సమాజం మనదని.. విద్యను అందించే గురువుల పట్ల మనం గౌరవంగా వ్యవహరించాలని చంద్రబాబు తెలిపారు. పిల్లలను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులందరికీ ఆయన టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.