NationalNews Alert

“ పవన్ బర్తడే గిఫ్ట్ ” గా హరిహర వీరమల్లు టీజర్

ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు స్పెషల్‌ గిఫ్ట్‌గా చిత్రబృందం హరహర వీరమల్లు టీజర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దీనికి  సంబంధించిన వీడియో క్లిప్స్ వైరల్‌గా మారాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఫ్యాన్స్‌కి పండగనే చెప్పొచ్చు. ఇంతకముందు ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీమ్లా నాయక్‌ అనుకున్న అంచనాలను సాధించలేకపోయినా హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాపై కూడా అభిమానుల అంచనాలు అత్యధికంగానే ఉన్నాయి.

పవన్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకి సంబంధించి ఏ వార్త వచ్చిన సరే నిమిషాల్లో వైరల్ అవుతుంది. అదే విధంగా ఈ టీజర్ ఇప్పుడు నెట్‌లో అదరగొడుతోంది.