InternationalNewsNews Alert

యూ వైబింగ్ సంచలనం…

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో చైనాకు చెందిన టెన్నిస్‌ ఆటగాడు యూ వైబింగ్‌ కొత్త రికార్డు సృష్టించాడు. ఆరున్నర దశాబ్దాల తర్వాత  ఒక గ్రాండ్‌స్లామ్‌లో చైనా నుంచి సింగిల్స్‌ విభాగంలో తొలి రౌండ్‌లో విజయం సాధించిన రెండో ఆటగాడిగా యూ వైబింగ్‌ చరిత్ర నెలకొల్పాడు. 174వ ర్యాంకర్‌ అయిన యూ వైబింగ్‌.. తొలి రౌండ్‌లో జార్జేరియాకు చెందిన 31వ సీడ్‌ నికోలోజ్ బాసిలాష్విలిని 6-3,6-4,6-0తో వరున సెట్లలో మట్టి కరిపించాడు. 1959లో వింబుల్డన్‌లో మెఫు-చి మాత్రమే మేజర్‌ విజయాలు సాధించాడు. ఇక 1935లో చైనాకు చెందిన చెంగ్‌ గయ్‌ యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో తొలి రౌండ్‌ మ్యాచ్‌ గెలిచాడు. అప్పటి నుంచి చైనా ఆటగాళ్ళు ఒక్కరు కూడా యూఎస్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌ అడ్డంకిని దాటలేకపోయారు. తాజాగా యూ వైబింగ్‌ మాత్రమే యూఎస్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌ను విజయవంతంగా అధిగమించాడు.