గోర్భచేవ్ కన్నుమూత
సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షడు మిఖాయిల్ గోర్బచేవ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గోర్బచేవ్ ఆసత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. 1985-1991 వరకు ఏడేళ్ల పాటు సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అనేక విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టి పరిపాలనా పరంగా తనదైన ముద్ర వేశారు. అప్పటి వరకు అమెరికాతో ఉన్న ఉద్రిక్తతలను తగ్గించి ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపచిన నేతగా గోర్భచేవ్ కు పేరుంది. అంతేకాదు. సంస్కరణవాదిగా ఆయన ప్రపంచ దేశాలు సైతం ఆయనను కీర్తించాయి. దేశంలో కొనసాగుతున్న ఉద్యమాలపై, నిరసనకారులపై ఉక్కుపాదం మోపకుండా ఎంతో ఓర్పుతో వ్యవహరించారు. తూర్పు యూరప్‌కు సోవియట్ యూనియన్ పాలన నుంచి విముక్తి కల్పించారు. అప్పటి నుంచే సోవియట్ యూనియన్ విడిపోయింది. దీంతో పశ్చిమ దేశాల్లో కూడా గోర్భచేవ్ కు మంచి పేరుంది. అయితే రష్యాలో మాత్రం అనేక మంది ఆయనపై మండిపడ్డారు. రష్యా వ్యవస్ధను చిన్నాభిన్నాం చేశారన్న విమర్శలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయనకు

1990లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. రష్యా నేతల్లో సుదీర్ఘ కాలం జీవించిన నేతగా కూడా గోర్భచేవ్ రికార్డులకెక్కారు. సిద్ధాంతాల పరంగా వైరం ఉన్నా .. గోర్భచేవ్ అంటే అమెరికన్లకు ఎంతో గౌరవం. ఇటీవల 90వ పుట్టిన రోజు జరుపుకున్న గౌర్భచేవ్ తకు అమెకరికా అద్యక్షుడు జో బైడెన్ తో పాటు అనేక మంది నేతలు శుభాకాంక్షలు తెలిపి ఆయనపై తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షునిగా వ్యవహరించిన మిఖాయిల్ లేని వార్త ప్రపంచంలోని అనేక దేశాలను దిగ్భ్రమకు గురి చేశాయి. ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని తెలిపాయి.

