NewsTelangana

HMDA ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణి..

పెద్ద పెద్ద పట్టణాల గురించి తలచుకోగానే ఎక్కువగా గుర్తొచ్చేది కాలుష్యం. ప్రస్తుతం అదే అతి పెద్ద అంశం కూడాను. ఈ కాలుష్యం అనేక విధాలుగా ప్రజల జీవితంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలోనే పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వాలు హరితహారం నుండి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ బ్యాన్‌ వరకు ఎన్నో చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన గణేష్‌ ఉత్సవాలను పర్యావరణాన్ని కాపాడే విధంగా పండగను జరుపుకునేందుకు గ్రీన్‌ గణేశా.. ఎకో గణేశా అంటూ హెచ్‌ఎమ్‌డీఏ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చూట్టింది. దీనికి భాగ్యనగరం వేదికగా మారింది. గత ఏడాది లాగానే ఈ ఏటా భాగ్యనగరంలో కూడా ఎకో ఫ్రెండ్లీ గణేశ అంటూ హెచ్‌ఎమ్‌డీఏ మట్టి విగ్రహాల పంపిణీని ప్రారంభించింది. హెచ్‌ఎమ్‌డీఏ 2017 నుండి ఈ ఎకో ఫ్రెండ్లీ గణేశ్‌ను ప్రమోట్‌ చేస్తోంది. ఏటా మట్టి విగ్రహాలను ఎక్కువ సంఖ్యలో పంపిణీ చేస్తోంది. గతేడాది 70వేల మట్టి విగ్రహాలను డోర్ డెలివరి చేయగా… ఈసారి అంతకు మించి ఏర్పాట్లు చేశారు.

కాగా ఈ ఏడాది 27 వ తేది నుంచి 30 వ తేది వరకు 41 ప్రాంతాల్లో సెంటర్లులో లక్ష మట్టి విగ్రహాలను ఉచితంగా అందిస్తున్నారు. ప్లాస్టిక్‌తో తయారుచేసే విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తే కాలుష్యం ఏర్పడుతుంది. విగ్రహాల నిమజ్జనం విషయంలో గతంలో కోర్టు నుంచి ఆంక్షలు ఉండటంతో ఈ ఏడాది మట్టి గణపతి విగ్రహాల సంఖ్య పెరగొచ్చు. కమ్యూనిటీగా… లేకా ఎన్జీవోలకు ఉచితంగా విగ్రహాలను అందిస్తామని స్పెషల్ ‌చీఫ్ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ తెలిపారు. సిటీలోని మొత్తం 41 ప్రాంతాలు మట్టి విగ్రహాలను ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఆరోగ్య శ్రీ ఆఫీస్, బంజారాహిల్స్, ఐఏఎస్‌ క్వార్టర్స్‌, బంజారాహిల్స్, కేబీఆర్ పార్క్‌, జూబ్లీహిల్స్‌, గ్రీన్‌ లాండ్స్‌, రోడ్ నెం.1 వెంకటేశ్వర స్వామి ఆలయం బంజారాహిల్స్, ప్రెస్ క్లబ్ హైదరాబాద్, ప్రెస్ అకాడమీ హైదరాబాద్, రాజా పుష్ప 7 హిల్స్‌ నర్సింగ్, గచ్చిబౌలి టోల్ ప్లాజా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అపార్ట్మెంట్, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, రోడ్ నెంబర్ 36 రత్నదీప్ సూపర్ మార్కెట్ జూబ్లీహిల్స్, టూప్స్ రెస్టారెంట్ జూబ్లీహిల్స్, పెద్దమ్మ తల్లి టెంపుల్ జూబ్లీహిల్స్, స్టార్ బగ్‌ రోడ్ నెంబర్ 92 జూబ్లీహిల్స్, మై హూ భూజ మాదాపూర్, శిల్పారామం హైటెక్ సిటీ, ఉప్పల్ మినీ శిల్పారామం, కూకట్‌పల్లి మెట్రో క్యాష్ అండ్ క్యారీ, హెచ్ఎండీఏ ఆఫీస్ మైత్రివనం అమీర్ పేట, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, బీఆర్‌కే భవన్, ఎన్టీఆర్ గార్డెన్, ప్రియదర్శిని పార్క్ సరూర్ నగర్, రాజీవ్ గాంధీ పార్క్ వనస్థలిపురం, కుందన్ బాగ్ బేగంపేట, దుర్గం చెరువు, నారాయణ గూడ పార్క్, భారతీయ విద్యా భవన్ సైనికాపురి, వాయుపురి, ఆరాంఘర్ జంక్షన్, నెనెక్నాంపూర్, మైండ్ స్పేస్ జంక్షన్ జంక్షన్ మాదాపూర్, మై హూం నవదీప్ మాదాపూర్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, కోటక్ మహేంద్ర బ్యాంక్, పెద్ద అంబర్ పేట నగర్ పంచాయితీ, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, హెచ్ సి ఎల్(HGCL) ఆఫీస్.