International

ఎడారిలో విరబూసిన పూలతోట

ఎడారిలో పూలతోటలను ఎప్పుడైనా చూసారా.. ఈ వింత అత్యంత పొడి వాతావరణం కలిగిన ఎడారి అటకామాలో జరిగింది. నిజంగా ఇది నమ్మశక్యం కాని నిజం. ఈ సమయంలో దీనిని చూస్తే ఎడారి అని ఎవరూ అనుకోరు. ఏడాదిలో కేవలం 15 మిల్లీమీటర్లు మాత్రమే ఇక్కడ వర్షపాతం. అయితే ఒక్కొక్కసారి ఎప్పుడూలేనంత కుంభవృష్టి కురిసినప్పుడు  ఇలా పూలతోటలతో మురిసిపోతుంది. సుమారు ఏడేళ్లకొకసారి ఇక్కడ ఇలా జరుగుతుందట. ఈ విషయాలను, చిత్రాలను IFS అధికారి సుశాంతనందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ అద్భుతాన్ని మనమూ చూసేద్దామా..