అంత్యక్రియల్లో కళ్లు తెరిచిన చిన్నారి..
సినిమాల్లో చనిపోయిన వారు తిరిగి బతకడం చూస్తాం. కానీ నిజ జీవితంలో అది దాదాపు అసాధ్యం. అయితే అంత్యక్రియల సమయంలో మూడేళ్ల పాప నిద్రలేచి తను చనిపోయిందని వైద్యులు చెప్పింది అబద్దమని నిరూపించింది. కళ్ళు తెరిచి నేను బతికే ఉన్నానని చెప్పి ఆశ్చర్యానికి గురి చేసింది. కాని ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన మెక్సికోలో ఆగస్టు 17న చోటు చేసుకుంది. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బంది తన పాప చనిపోయిందని నిర్థారించారని తల్లి మారీ జాన్ మెండోజా ఆరోపించారు. విల్లా డీ రమోస్ ప్రాంతంలో నివాసం ఉండే మార్టినెజ్ మెండోజాకు 3 ఏళ్ల కూతురు కమిలా రోక్సానా ఉన్నారు. కమిలా రోక్సానా కొన్ని రోజులుగా కడుపు నొప్పి, వాంతులు, జ్వరంతో బాధపడుతుండగా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాప పరిస్థితి విషమించడంతో వైద్యులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. ఇంతలో పాపకు పారాసిటమాల్ మాత్రలు వేశారు.
మరో వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లక ముందే చిన్నారి ఆరోగ్యం క్షీణించింది. అక్కడి వైద్యులు మందులు వేసి చిన్నారికి పండ్లు, నీళ్లు ఇవ్వాలని సూచించారు. అయినప్పటికీ పాప పరిస్థితి మెరుగుపడలేదు. అత్యవసర గదికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఆసుపత్రి సిబ్బంది చాలా సేపు బిడ్డను వెంటిలేటర్ పై ఉంచారని తల్లి పేర్కొంది. 10 నిమిషాల తర్వాత ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్‌ను తీసివేసి చనిపోయిందని తెలిపారు. డీహైడ్రేషన్‌తో మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో చిన్నారిని ఉంచిన పేటికలో గాజు ముక్క గాలిలో తేలడాన్ని ఆమె తల్లి గమనించింది. అప్పుడు కమీలా కళ్ళు కదులుతున్నట్లు ఆమె బామ్మ గమనించింది. వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే, వైద్యులు ప్రయత్నించినప్పటికీ, పాప కొద్దిసేపటికే మరణించింది. బాధితురాలి తల్లి మెండోజా.. బిడ్డ చనిపోయిందని నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని, అప్పుడు ఇలాంటివి మళ్లీ జరగవని అన్నారు.

