దోషులను ఘన సన్మానం చేయడం తప్పు
బిల్కిస్ బానో రేస్ కేసు దోషులను ఘన సన్మానం చేయడం తప్పే అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. దోషి అంటే దోషేనని… వారికి సన్మానాలు జరపడం సరికాదని ఆయన విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దోషులను రిలీజ్ చేశారని చెప్పారు. ఈ అంశాన్ని చట్టసభల్లో చర్చించడం అనవసరమని తెలిపారు.
2002 నాటి గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై జరిగిన అత్యాచార ఘటనలో.. ఇటీవలే దోషులు జైలు నుంచి విడుదల అయ్యారు. జైలు నుంచి రీలీజ్ అయిన వీరికి కొందరు ఘన సన్మానంతో సత్కరించారు. ఈ అంశం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దోషులను విడుదల చేయడంపై వివిధ రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

