బీజేపీ నేత సోనాలీ ఫొగట్ ఆకస్మిక మృతి
మృత్యువు ఎవరిని, ఎప్పుడు, ఏరూపంలో పలకరిస్తుందో ఎవరికీ తెలియదు. అంతవరకూ ఆడుతూ పాడుతూ ఉన్నవారు హఠాత్తుగా మృత్యుఒడిలోకి జారుకుంటారు. హర్యానా బీజేపీ నాయకురాలు సోనాలి ఫొగట్ గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. ఆమె వయస్సు 42 సంవత్సరాలే. తన సిబ్బందితో కలిసి సరదాగా గోవా వెళ్లిన ఆమె హఠాత్తుగా హార్ట్ ఎటాక్‌కి గురై ప్రాణాలు విడిచినట్లు ఆమె అసిస్టెంట్ తెలిపారు. ఈమె హర్యానాలోని ఫతేబాద్‌లో భుథాన్ గ్రామంలో మిడిల్ క్లాస్ కుటుంబంలో జన్మించారు. TIKTOK ద్వారా ఆమెకు చాలా ఫోలోయర్స్ ఉన్నారు. దీనిద్వారా పాపులర్ అయిన ఆమె బిగ్‌బాస్ 14 సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి స్టార్‌గా నిలిచారు. దీనితో 2019లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఆధమ్పూర్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈమె 2024 ఎన్నికలలో పోటీ చేయాలని కూడా భావిస్తున్నారు. చనిపోవడానికి కొద్ది గంటలముందే అమె ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ ఆవుతోంది. ఈ వీడియోలో ఆమె పింక్ టర్బన్ ధరించి, బాలీవుడ్ పాటకు రీల్ చేస్తూ అందంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. 2006లో హిసార్ దూరదర్శన్‌లో యాంకరింగ్‌తో కెరీర్ ప్రారంభించిన సోనాలీ 2008లో బీజేపీలో చేరారు.

