Andhra PradeshNews

శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు

శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. శ్రావణ మాసం పైగా సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ప్రధాన వీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మరోవైపు దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుండటంతో… క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో, అధికారులు ఏర్పాట్లు చేశారు.