సుత్రాధారి, పాత్రధారి ఆవుల సుబ్బారావు…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడుల వెనుక కుట్ర కోణం గుట్టురట్టయ్యింది. పక్కా ప్రణాలికతోనే విధ్వంసం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అభ్యర్థులను నరసరావుపేటకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి రెచ్చగొట్టినట్టు తెలుస్తోంది. ప్రైవేట్ అకాడమీ సహకారంతోనే ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డట్టు భావిస్తున్నారు. అకాడమీల్లోనే నిరసనకారులకు షల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌కి వచ్చి.. ముందస్తు పథకం ప్రకారమే దాడులకు తెగబడినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. విద్యార్థులకు వాటర్ బాటిళ్లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లను సైతం ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ అకాడమీలు సప్లై చేసినట్టు ధ్రువీకరించారు. పది ప్రైవేటు డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఆర్మీ పరీక్ష క్యాన్సిల్ అయిదంటూ యూట్యూబ్‌లో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు వీడియోలు పోస్ట్ చేసినట్టు పోలీసులు ధ్రువీకరించారు. సికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావును ప్రకాశం జిల్లాలో… పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం సుబ్బారావును నరసరావుపేటకు తరిలించారు. డిఫెన్స్ కోర్సుల్లో అభ్యర్థులకు సుబ్బరావు కొన్నాళ్లుగా కోచింగ్ ఇస్తున్నారు.

