వరదలకు కొట్టుకుపోయిన రైల్వే బ్రిడ్జ్
భారీ వర్షాలకు హిమచల్ ప్రదేశ్‌లో నదులు ఉగ్ర రూపం దాల్చాయి. కాంగ్రా, చంబ్ర, బిలాస్ పూర్, సిర్మౌర్, మండి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు చక్కి నదికి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. వరద తీవ్రతకు 800 మీటర్ల పొడవైన రైల్వే వంతెన కుప్పకూలింది. గత నెలలో వంతెన యొక్క పిల్లర్‌లో పగుళ్లు ఏర్పడటంతో రైలు సేవలను నిలిపివేశారు. ఇప్పుడు ఆ పిల్లర్ ఇంకా బలహీనపడి కొట్టుకుపోయింది. ఈ వంతెన హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలను కలుపుతుంది.
1928లో బ్రిటిష్ వారు నిర్మించిన వంతెన. ఈ నారో గేజ్ రైలు మార్గంలో ప్రతిరోజూ ఏడు రైళ్లు ప్రయాణిస్తుంటాయి. రైల్వే వంతెన కూలిపోవడంతో పఠాన్ కోట్, జోగిందర్ నగర్ మధ్య రైల్వే సేవలు నిలిచిపోయాయి. పాంగ్ డ్యామ్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉన్న వందలాది గ్రామాలకు ఈ రైలు మార్గమే జీవనాధారం. ఇక్కడ రోడ్లు సరిగా లేకపోవడంతో బస్సు సేవలు కూడా నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు కాంగ్రా జిల్లా కేంద్రానికి అనుసంధానించడానికి రైలు సేవలను ఉపయోగించుకుంటున్నారు. అంతే కాకుండా కాంగ్రా జిల్లాలోని చాలా నదులు ఉధృతంగా ప్రవహించడంతో, అనేక రహదారులు మూసుకుపోయాయి. వచ్చే 24 గంటల పాలు భారీ వర్షాలు ఉంటాయని వాతవరణ శాఖ హెచ్చరించింది.

