Businesshome page sliderHome Page SliderInternationalviral

భయం పుట్టిస్తున్న ఆంథ్రోపిక్ “క్లాడ్ మైథోస్”

ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఏఐ మోడల్ “క్లాడ్ మైథోస్” టెక్, బ్యాంకింగ్ దిగ్గజాలను వణికిస్తోంది. విడుదల కాని Anthropic రూపొందించిన “క్లాడ్ మైథోస్”పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. ఈ మోడల్ బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ వ్యవస్థల్లో ఉన్న లోపాలను గుర్తించేందుకు తయారైంది. కంప్యూటర్ సిస్టమ్స్‌, బ్రౌజర్‌లు, సైబర్ సెక్యూరిటీలో దశాబ్దాలుగా ఉన్న బలహీనతలను క్షణాల్లో కనిపెడుతుంది. ఇది మంచి విషయమే అయినప్పటికీ…ఇదే టెక్నాలజీ నేరగాళ్ల చేతికి వెళ్తే? అదే ఇప్పుడు ప్రధాన భయం పట్టుకుంది. ప్రపంచ బ్యాంకింగ్‌ వ్యవస్థ అంతా పరస్పరం అనుసంధానమై ఉంటుంది. ఒక బ్యాంక్‌పై సైబర్ దాడి జరిగితే… పేమెంట్స్‌, స్టాక్ మార్కెట్‌, ఫారెక్స్‌, మనీ మార్కెట్‌—అన్నీ ప్రభావితమవుతాయి. ఈ ఏఐ ఇంకా పబ్లిక్‌కు విడుదల కాలేదు. Apple, Microsoft, Amazon, Google వంటి దిగ్గజ కంపెనీలు టెస్టింగ్‌లో పాల్గొన్నాయి. టెస్టింగ్‌లో ఇది మనుషుల కంటే మెరుగైన పనితీరు చూపింది. అంతేకాదు… హ్యాకింగ్ తరహా టాస్కులను కూడా పూర్తి చేసింది. అక్కడే ప్రమాద సూచనలు మొదలయ్యాయి. దీంతో దీని విడుదలను నిలిపివేశారు. కానీ… అనధికారిక యాక్సెస్ జరిగిందన్న వార్తలు మరింత ఆందోళన పెంచుతున్నాయి. కంపెనీ కూడా ఈ విషయాన్ని అంగీకరించింది. మొత్తానికి… రక్షణ కోసం తయారైన టెక్నాలజీ… ప్రమాదకర ఆయుధంగా మారే అవకాశమే ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది.