Breaking Newshome page sliderHome Page SliderNational

‘బాహుబలి’ రాకెట్ విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ ‘బాహుబలి’ రాకెట్ ప్రయోగం విజయవంతంగా గగనతలంలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ‘ఎల్‌వీఎం3-ఎం6’ ను ఉదయం 8:54 గంటలకు బుధవారం ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఉపగ్రహం ద్వారా నేరుగా మొబైల్‌కు కనెక్టివిటీని అందించే , అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌ మొబైల్‌ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ‘బ్లూ బర్డ్‌ బ్లాక్‌-2’ శాటిలైట్ సుమారు 6,100 కిలోల బరువు, 43.5 మీటర్ల పొడవైన ఈ రాకెట్ ఎర్త్ ఆర్బిట్ చరిత్రలో ప్రయోగం నిర్వహించడం ఇదే తొలిసారని ఇస్రో పేర్కొంది. తొలుత ఉదయం 8.54 గంటలకు ఈ ప్రయోగాన్ని షెడ్యూల్‌ ఖరారు కాగా, సాంకేతిక కారణాల రీత్యా 90 సెకన్ల పాటు వాయిదా తర్వాత ప్రయోగించారు. ఈ ఉపగ్రహ సమూహంతో ప్రతి ఒక్కరికీ, ప్రతిచోటా, అన్ని వేళలా 4G, 5G వాయిస్, వీడియో కాల్స్, టెక్స్ట్‌లు, స్ట్రీమింగ్, డేటాను అందుబాటులోకి తీసుకురానుంది. మొత్తం మూడు దశల్లో ఈ ప్రయోగం పూర్తయిందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్‌ వి. నారాయణన్‌ తెలిపారు.

భారత గడ్డపై నుంచి అతిపెద్ద వాణిజ్య కమ్యూనికేషన్ శాటిలైట్ ఇది భూమికి సమీప కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఎల్వీఎం-3 -ఎం6 రాకెట్ పై అమర్చిన ఈ శాటిలైట్ నుంచి విడిపోయి, సుమారు 520 కిలోమీటర్ల ఎత్తులో నిర్దేశిత కక్ష్యలో చేరుకుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇస్రో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ అభివృద్ధి చేసిన క్రయోజెనిక్ ఇంజిన్‌తో నడిచే మూడు-దశల హెవీ-లిఫ్ట్ రాకెట్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నిర్మించిన దీనిలోని రెండు S200 సాలిడ్ రాకెట్ బూస్టర్‌లు ప్రయోగానికి అవసరమైన చోదకశక్తి (థ్రస్ట్‌)ను ఉత్పత్తి చేస్తాయని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్ అనేది గ్లోబల్ ఎల్ఈఓ ఉపగ్రహ సమూహంలో ఇది ఒక భాగం.
న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ అనే సంస్ధ ఇస్రో కు వాణిజ్య విభాగంగా పనిచేస్తుంది. దీని పరిధి 2,400 చదరపు అడుగులు(దాదాపు 200 మీటర్లకు పైగా) ఉంటుంది. బ్లూబర్డ్ బ్లాక్-2 స్పెస్ క్రాఫ్ట్ కక్ష్యలో ఉంచిన అతిపెద్ద ఫేజ్డ్ అర్రే యాంటెన్నాలలో ఒకదానిని కలిగి ఉంది. డేటా సామర్థ్యాన్ని మరింత గణనీయంగా పెంచుతుంది. తద్వారా కమ్యూనికేషన్ టెక్నాలజీలో త్వరితగతిన పురోగతిని సాధించడంలో సహాయపడుతుంది.

మరోవైపు , ఈ బ్లూబర్డ్-6 ఉపగ్రహం భారత్ – అమెరికా మధ్య అంతర్జాతీయ సహకారాన్ని పరిగణిస్తోంది. ఇది ఉపగ్రహ ఆవిష్కరణ, కనెక్టివిటీ, విస్తరణ, భాగస్వామ్యాలలో ఇస్రో ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంది.
గగన్‌యాన్‌ కోసం సిద్ధమవుతోన్న వేళ ఈ బహుబలి ప్రయోగం ఆత్మవిశ్వాసం కలిగిస్తోంది. ఇస్రో చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయని ’’ ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణన్ హర్షం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ ప్రశంసలు …
బహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతంపై ప్రధాని నరేంద్రమోదీ ఆనందం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచ వాణిజ్య ప్రయోగాల్లో భారత్‌ మరోసారి సత్తా చాటిందని ఇస్రోను కొనియాడారు. అంతరిక్ష రంగంలో మన దేశం అత్యున్నత స్థానానికి ఎదిగిందని , ఈ విజయం ఆత్మనిర్భర్‌ భారత్‌వైపు మన ప్రయత్నాలను ప్రతిబింబిస్తోందంటూ ప్రధాని మోదీ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.