అధికారం లోకి రారు ..రానివ్వను
రాజకీయాల్లో తాను ఉన్నంతవరకు కల్వకుంట్ల కుటుంబానికి అధికారం దక్కనివ్వబోనని శపథం ముఖ్యమంతి కేసీఆర్ శపథం చేశారు . 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడింట రెండొంతుల మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా ఆయన వ్యక్తం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సమాజం విచ్ఛిన్నమైందని, ముఖ్యంగా పాలమూరు బిడ్డగా ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయంపై కేసీఆర్ సంజాయిషీ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన వ్యక్తిగత విమర్శలకు ఘాటుగా స్పందిస్తూ, తోలు తీస్తామనే హెచ్చరికలకు భయపడేది లేదని, ప్రజలే బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం వైఫల్యాలు, ఫోన్ ట్యాపింగ్ అక్రమాలు, ఈ-కార్ రేసింగ్ వంటి అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమని, ధైర్యముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సవాలు విసిరారు. జూబ్లీహిల్స్ ఫలితం నుంచి పంచాయతీ ఎన్నికల వరకు ప్రజలు కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారని, భవిష్యత్తులో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వందకు పైగా స్థానాల్లో విజయం సాధించి తీరుతామని స్పష్టం చేశారు. కేటీఆర్ అమెరికా సంస్కృతిని, వారి కుటుంబ వ్యవహారాలను ఎద్దేవా చేస్తూ, సొంత చెల్లెలికే న్యాయం చేయలేని వారు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారని ప్రశ్నించారు. ఈ సభ ద్వారా రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు.

