నా భార్యను అందుకే చంపేసా
హైదరాబాద్ మీర్‌పేట్‌లో గతేడాది జరిగిన అత్యంత దారుణమైన హత్య కేసులో 11 నెలల తర్వాత విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు గురుమూర్తి తన మరదలితో ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే భార్యను పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ సంబంధం విషయంలో దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగి పంచాయితీలు పెట్టినా అతని తీరులో మార్పు రాలేదు, తన మరదలితో కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే భార్యను వదిలించుకోవాలని అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఎటువంటి సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండేందుకు భార్య శరీర భాగాలను ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడికించి, ఆపై పొడి చేసి చెరువులో కలిపేశాడు, ఈ దారుణం అప్పట్లో పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. అయితే ఘటనా స్థలంలో లభించిన చిన్న చిన్న ఆనవాళ్లపై డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన పోలీసులు కేసును ఛేదించారు, చివరకు 11 నెలల తర్వాత గురుమూర్తి తన నేరాన్ని అంగీకరించడంతో ఈ సంచలన కేసులోని మిస్టరీ వీడింది.

