ఓట్లు చీల్చేందుకే పోటీ కాదు: ఒవైసీ స్పష్టీకరణ
పాట్నా: బిహార్ ఎన్నికల్లో ‘ఇండీ’ కూటమి ఓట్లు చీల్చేందుకే పోటీ చేస్తోందన్న ఆరోపణలను AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు.
‘2020లో మేము ఐదు సీట్లు గెలిచాం. పోటీ చేసిన మిగతా 14 స్థానాల్లో 9 చోట్ల మహాగఠ్‌బంధన్ గెలిచింది. 2024లో కిషన్‌గంజ్ ఎంపీ సీటులో మేము 2 లక్షలకుపైగా ఓట్లు సాధించాం. ఒకే సీటులో పోటీ చేసినా BJP అనేక ప్రాంతాల్లో గెలిచిందని’ ఆయన వివరించారు.
ఓవైసీ మాట్లాడుతూ, “రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న గుత్తాధిపత్యాన్ని (monopoly) చెరిపివేయడానికే మా పోటీ” అని స్పష్టం చేశారు.
ఈసారి బిహార్‌లో 24 స్థానాల్లో MIM పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

