వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లపై సిట్ దాడులు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపుతున్న లిక్కర్ స్కాం కేసు నేపథ్యంలో సిట్ అధికారులు మంగళవారం ఉదయం నుండి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చెందిన పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహించారు.
సమాచారం ప్రకారం, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతిలోని ఆయన నివాసాలు మరియు కార్యాలయాలపై సమాంతరంగా సిట్ సోదాలు కొనసాగిస్తున్నాయి. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై, ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన మిథున్ రెడ్డిపై మళ్లీ ఈ దాడులు జరగడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
అధికార వర్గాల సమాచారం ప్రకారం, సిట్ అధికారులు కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ డేటా, మరియు లావాదేవీల రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ రైడ్స్ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటనే అంశంపై వైసీపీ నేతలు ఇంకా స్పందించలేదు.
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో మిథున్ రెడ్డి ఇళ్లపై మళ్లీ సిట్ దాడులు జరగడం కొత్త చర్చలకు దారితీస్తోంది.

