భారతీయ బ్యాంకులపై మండిపడ్డ విజయమాల్యా
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ వ్యాపార వేత్త విజయమాల్యా భారతీయ బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలు ఎగవేసిన కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విదేశాలలో తలదాచుకుంటున్న ఆయన తాజాగా భారతీయ బ్యాంకులపై మండిపడుతూ, తీవ్ర విమర్శలు కురిపించారు. తన ఆస్తులన్నీ బ్యాంకులు ఎప్పుడో రికవరీ చేసిన బ్యాంకులు ఇంకా తనపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఆ నిధుల వివరాలను అధికారికంగా వెల్లడించలేదన్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం తీసుకున్న రుణాలకు గాను అనేక రెట్లు తననుండి ఎప్పుడో వసూలు చేశారని, దానికి సంబంధించిన అకౌంట్ స్టేట్ మెంట్లను తనకు అందించాలని ఇప్పటికే పలుమార్లు భారత్ లోని కోర్టులకు విన్నవించానన్నారు. తాను పూర్తి రుణాలు చెల్లించినప్పటికీ ఇంకా రికవరీ ప్రక్రియను బ్యాంకులు కొనసాగిస్తూనే ఉన్నాయన్నారు. ఇటీవల తన అకౌంట్ స్టేట్ మెంట్స్ అందించాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో కూడా ఆయన పిటిషన్ వేశారు.

