ఆ మీడియాపై ట్రంప్ రూ.86వేల కోట్ల దావా..!
వాషింగ్టన్: సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టైన్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సంబంధాలు ఉన్నాయంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దీనిపై వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో 2003లో జెఫ్రీ ఎప్‌స్టైన్ పుట్టిన రోజు సందర్భంగా శృంగారాత్మక చిత్రాన్ని ట్రంప్ పంపించారని ఆరోపించింది. దీనిపై అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మీడియా సంస్థపై 10 బిలియన్ డాలర్ల భారత కరెన్సీలో దాదాపు రూ.86వేల కోట్లకు దావా వేశారు. అమెరికా మీడియా టైకూన్ రూపర్ట్ మర్దోక్‌పైనా ట్రంప్ దావా వేశారు.

