Home Page SliderNationalNews AlertPolitics

సీఎం సీటుపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కుర్చీ పొందడం అంత సులభం కాదన్నారు. అవకాశం వచ్చినప్పుడే ఆ కుర్చీ లో కూర్చోవాలని వ్యాఖ్యానించారు. బెంగళూరులో న్యాయవాదుల సంఘం నిర్వహించిన కెంపెగౌడ జయంతి వేడుకల్లో పాల్గొన్న డీకే ఈ సందర్భంగా మాట్లాడారు. ‘ఖాళీ కుర్చీలు అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది న్యాయవాదులను అందులో కూర్చోకపోవడాన్ని ఇక్కడ చూస్తున్నాను. కుర్చీ పొందడం అంత సులభం కాదు. మీరు అవకాశం వచ్చినప్పుడే ఆ సీట్లో కూర్చోవాలి.. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. మీలో చాలా మంది త్యాగపూరితంగా ఉన్నట్లు అనిపిస్తోంది. మీకు అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోండి’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ఈ మాటలు రాజకీయాలనుద్దేశించే మాట్లాడినట్లు పలువురు భావిస్తున్నారు.