అదరగొట్టిన నీరజ్ చోప్రా..అతని ఖాతాలో మరో టైటిల్.
సూపర్ ఫామ్ లో ఉన్న భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా అదరగొట్టాడు. మంగళవారం జరిగిన 85.29 మీటర్ల త్రోతో గోల్డెన్ స్పైక్ మీట్ లో అతడు విజేతగా నిలిచాడు. దీనితో అతని ఖాతాలో మరో టైటిల్ చేరింది. దక్షిణాఫ్రికాకు చెందిన డౌ స్మిత్ (84.12మీ) రెండో స్థానం సాధించాడు. ప్రపంచ మాజీ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ (83.63) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. విజేతగా నిలిచినప్పటికీ ప్రదర్శన ఆశించినంత ఉత్తమంగా లేకపోవడంతో నీరజ్ అసంతృప్తిగా కనిపించాడు. 27 ఏళ్ల నీరజ్ ఈ నెల 20న పారిస్ డైమండ్ లీగ్ టైటిల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు అతడు దోహాలో 90 మీటర్ల మార్కును అందుకున్నాడు.

