home page sliderHome Page SliderNewsPoliticsTelanganaviral

ముగ్గురు నాయకులను కోల్పోయిన జూబ్లీహిల్స్

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఏడాదిన్నర కాలంలో ముగ్గురు ప్రముఖ రాజకీయ నాయకుల్ని కోల్పోయింది. ముందుగా మాజీ కార్పొరేటర్‌ మహ్మద్ షరీఫ్‌ 2023 అక్టోబర్‌లో అనారోగ్యంతో మృతిచెందగా, ఆయన సతీమణి మరియు కార్పొరేటర్‌ అయిన షాహీన్‌బేగం 2024 జూన్‌లో మరణించారు. తాజాగా జూన్ 8, 2025న జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ ముగ్గురు నాయకుల మరణాలు నియోజకవర్గ ప్రజలతో పాటు రాజకీయవర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి. మాగంటి అనంతరం ఎమ్మెల్యే స్థానాన్ని ఎవరూ భర్తీ చేస్తారు? ఉప ఎన్నికలో ఎవరెవరు తలపడతారు అనే అంశాలపై చర్చ జరుగుతోంది. గతంలో జరిగిన ఉదాహరణలతో పోలిస్తే, మాగంటి కుటుంబానికి ఈ సీటు దక్కే అవకాశాలపై ఊహాగానాలు మొదలయ్యాయి.