Home Page Sliderindia-pak warNationalNews Alert

పాఠ్యాంశంగా ఆపరేషన్ సింధూర్..

ఆపరేషన్ సింధూర్‌ను దేశానికి గొప్ప విజయంగా భావిస్తున్నామని, అందుకే దీనిని తమ మదర్సాల సిలబస్‌లో చేర్చామని, ఉత్తరాఖండ్ రాష్ట్ర మదర్సాల విద్యాబోర్డు ఛైర్మన్ ముఫ్రీ షామున్ ఖాస్మి ప్రకటించారు. ఇకపై విద్యార్థులకు మదర్సాల సిలబస్‌లో ఆపరేషన్ సింధూర్ గురించిన పాఠాలు నేర్పిస్తామన్నారు. ఈ ఆపరేషన్ ఆవశ్యకత, దేశ భద్రత, మన సైనికుల విజయాలు గురించి విద్యార్థులు తెలుసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీయడం ఏ మతమూ సమ్మతించదని, అందుకే ఉగ్రవాదులకు తగిన బుద్ది చెప్పామని పేర్కొన్నారు. పహల్గామ్‌లో ఉగ్రవాదులు దాడి చేయడం ఖురాన్‌ను తక్కువ చేసినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని తాము సహించబోమన్నారు.