రన్నింగ్ కారులో మంటలు..
రంగారెడ్డి జిల్లా ఆరాంఘర్ చౌరస్తా లో రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అలర్ట్ ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నలుగురు కారులో నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. అప్పటికే కారు కాలి బూడిదైంది. సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో పాయల్ అనే మహిళ, మరొక వ్యక్తీ, ఆమె ఇద్దరు పిల్లలు, ఒక పెంపుడు కుక్క ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

