Home Page SliderInternationalPolitics

‘మీరు నీరు ఆపితే, మేం శ్వాస ఆపుతాం’..వైరల్ వీడియో

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధు నది జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింధు జలాలను ఆపేస్తే భారత్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయూద్ గతంలో హెచ్చరించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. భారత ప్రధాని మోదీకి వార్నింగ్ ఇస్తూ మీరు కశ్మీర్‌లో డ్యామ్ కట్టి పాకిస్తాన్‌కు సింధు జలాలు ఆపేస్తే, మేం మీ శ్వాస ఆపుతాం అంటూ బెదిరింపులకు దిగాడు. ఆ నదుల్లో మీ రక్తం ప్రవహిస్తుంది అంటూ హెచ్చరించాడు. ఈ వీడియోను ఇప్పుడు ఐఎస్‌ఐ వైరల్ చేస్తూ పాకిస్థానీయులను రెచ్చగొడుతోంది. మరో పక్క పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ పహల్గాంలో దాడి చేసిన వారు స్వతంత్య్ర సమరయోధులంటూ వ్యాఖ్యానించడం సంచలనమయ్యింది.